కృష్ణ గోదావరి జిల్లా లు ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారాలు ... సహజ సిద్ధమైన ప్రకృతి అందాలు .. సముద్రపు ఒడ్డు .. గోదావరి తీరం .. కొండలు .. లంకలు .. పచ్చటి పొలాలు .. కొబ్బరి తోటలు . ప్రకృతి సోయగాలు .. వయ్యారాలు ఒలికే కాలువలు .. వంపులు తిరిగే వాగులు .. వేదనాదాలు .. స్వయంభూ మూర్తులు .. పురాణ ఇతిహాసా సంబంధ చారిత్రక ప్రదేశాలెన్నోకలవు వాటి గురించి ఇప్పుడు తెల్సుకుందాం ..
సనాతన ధర్మ వైభవానికి ఎందరో మహారాజులు ..సంస్థానాధీశులు .. వదాన్యులు ఎంతో విలువైన భూములను ఆస్తులు ఏర్పరిచి ఎన్నో ఆలయాలు సత్రాలు నిర్మించి వైభంగా నిర్వహించడానికి ఏర్పాటు చేశారు .
ఈ మూడు జిల్లాలోని దేవాలయాలను మనం సముద్ర తీర ప్రాంతం లో గల ఆలయాలు , నదీతీరంలో గల ఆలయాలు , గిరిలుపై గల ఆలయాలుగా మరియు పురాణ సంబంధ ఆలయాలు గా కూడా విభజించి తెలుస్కోవచ్చు .
అష్టాదశ శక్తి పీఠాలలో రెండు క్షేత్రాలు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నాయి .. 10వ శక్తి పీఠమైన పురుహూతికా అమ్మవారి శక్తి పీఠం పిఠాపురం లోను , 12వ శక్తి పీఠమైన శ్రీ మాణిక్యాంబా శక్తి పీఠం ద్రాక్షారామం లోను కొలువైయున్నారు . అదేవిధంగా పంచారామ క్షేత్రాలలో 4 క్షేత్రాలు ఈ మూడు జిల్లాలో ఉన్నాయి .. సామర్లకోట లో శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయం , ద్రాక్షారామం లో శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవాలయం , భీమవరం లో సోమేశ్వర స్వామి వారి ఆలయం , పాలకొల్లులో క్షీరారామలింగేశ్ వరస్వామి ఆలయాలున్నాయి . పంచమాధవ క్షేత్రాలలో ఒకటైన కుంతి మాధవ క్షేత్రం. త్రిగయా క్షేత్రాలలో ఒకటైన పాదగయా క్షేత్రం పిఠాపురం లో ఉన్నాయి .
ఎత్తైన గోపురాల లలో ఆంధ్రప్రదేశ్ లోనే 1వ స్థానం లో 200 అడుగుల ఎత్తుతో గొల్లలమామిడాడ శ్రీ కోదండ రామచంద్ర మూర్తి ఆలయం విరాజిల్లుతుంది . .. ఆనాటి శిల్ప కళాత్మక ప్రతీకైనా సర్పవరం భావనారాయణ స్వామి వారి ఆలయం ఉండగా .. ఆశ్చర్యపరిచే పానకాల లక్ష్మీనరసింహువుడు మంగళగిరిలో కొలువైయున్నాడు . భక్తుల పాలిట కల్పతరువు అన్నవరం శ్రీ వీరవేంకటేశ్వరుడు .. చిన్నతిరుపతిగా పేర్గాంచిన ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరుడు .. అమ్మలగన్నయమ్మ ముగ్గురాలమ్మ మూలపుటమ్మ విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం .. ఏడూ శనివారల దేవుడు వాడపల్లి శ్రీ వేంకటేశ్వరుడు .. అన్నాచెల్లాల గట్టు అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహుడు ... విఘ్నాలను దూరం చేసే బొజ్జగణపయ్య అయినవిల్లి శ్రీ విగ్నేశ్వరుడు .. వివాహం ఆలస్యమౌతున్నవారు దర్శించాల్సిన క్షేత్రం మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి.. ఇలా ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి ..
కృష్ణ గోదావరి జిల్లాలకు వెళ్ళినప్పుడు తప్పకుండా రుచిచూడాల్సినవి ఆత్రేయపురం పూతరేకులు , తాపేశ్వరం కాజా , కాకినాడ కాజా , అంబాజీపేట పొట్టచెక్కలు .సర్పవరం మామిడితాండ్ర , గోదావరి పులసలు , పెద్దాపురం పాలకోవా , రాజమండ్రి రోజ్ మిల్క్ , పెనుగొండ కజ్జికాయలు, భీమవరం బెల్లంగోవ్వలు , నగరం గారాజి , బందరు లడ్డు రుచి చూడాల్సిందే ..
కృష్ణ గోదావరి జిల్లాలు సంస్కృతి సంప్రదాయాలకు జానపద కళలకు పెట్టింది పేరు .. భోగిమంటలు , సంక్రాంతి గొబ్బెమ్మలు హరిదాసుల పాటలు కోడి పందాలు .. ప్రభలు .. తప్పెడగుళ్లు , హరి కథలు , బుర్రకథలు , గంగిరెద్దుల మేళాలు , రంగవల్లులు ,వీరనాట్యం , గరగ నృత్యం , కోలాటాలు , కత్తిసాము, కర్రసాము , బుట్టబొమ్మలు మరోన్నో కళలను ఇక్కడ మనం చూడవచ్చు ...
ప్రకృతి ఆరాధించడం సనాతన ధర్మం లో భాగం .. మన దేవి దేవతలును ప్రకృతి స్వరూపంగా మనం పూజిస్తాం .. తూర్పుగోదావరి జిల్లాలో బండి ముత్యాలమ్మ వారి దేవస్థానం మనకు నిదర్శనం .. ఇక్కడ తాడిచెట్టునే అమ్మవారిగా కొలుస్ తారు. . .
మనం ఎత్తైన గోపురాలు కోసం వింటూనే ఉంటాం, కానీ అసలు గోపురాలు లేని ఆలయాలు కూడా ఉన్నాయి అవి ఆచంట మండలం లో పెదమల్లం గ్రామం లో గల పళ్ళాలమ్మ మాచేనమ్మా అమ్మవారి ఆలయం , జంగారెడ్డి గూడెం మండలం గురవాయిగూడెం గ్రామం లో గల శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం . ఈ రెండు ఆలయాలు గోపురాలు లేకుండా ఉన్నాయి ..
పౌర్ణమి , అమావాస్య రంగుల మారుతున్న శివలింగం భీమవరం లో కలదు .. శ్రీ సోమేశ్వర స్వామి వారు చంద్ర ప్రతిష్ట కావడం వలన ఈ విధంగా చంద్రుడు రంగులు మారుతున్నారని స్థలపురాణం .
మనం ఎంత ఎత్తు ఉంటె అంతే ఎత్తులో స్వామి వారి కనిపించే క్షేత్రం తొలి తిరుపతి . ఈ క్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోట కు 15 కిమీ దూరం లో ఉంది . భాగవత పురాణం లో . ధ్రువోపాఖ్యానం స్థలపురాణంగా కలిగిన క్షేత్రం .
శివుడు లింగ రూపం లో దర్శనమిస్తాడు .. ఈ క్షేత్రం లో మాత్రం సాకార రూపం లో అదికూడా తలక్రిందులుగా తపస్సు చేస్తూ దర్శనమివ్వడం ఆశ్చర్యపరుస్తుంది . పార్వతి అమ్మవారి ఒడిలో చిన్నపిల్లవాడిగా కుమారస్వామి దర్శనమిస్తాడు . ఈ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో యనమదుర్రు గ్రామం లో ఉంది పేరు ఈ క్షేత్రం పేరు శ్రీ శక్తీశ్వర క్షేత్రం .
శివయ్య అభిషేకప్రియుడు .... అందుకేనేమో సంవత్సరం లో 11 నెలలకు నీటిలోనే ఉంటూ ఒక్క నెల రోజులు మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే క్షేత్రం నత్త రామేశ్వరం . ఇక్కడ రెండు శివలింగాలు ఉన్నాయి ఒకటి శ్రీరామా ప్రతిష్టితం మరొకటి పరశురామ ప్రతిష్ఠితం .. రాముల వారు ప్రతిష్ట చేసిన శివలింగం భక్తుల దర్శనానికి యోగ్యంగా ఉంటె పరశురామ ప్రతిష్ఠితమైన శివలింగం మాత్రం పవిత్ర గోస్తనీ నదిలో 11 నెలలు ఉంటుంది సంవత్సరం లో వైశాఖ మాసం లో మాత్రమే భక్తులకు దర్శనమిస్తారు .
శైవక్షేత్రాలలో సాధారణంగా స్వామివారికి అమ్మవారికి విడివిడిగా సన్నిధిలు ఉంటాయి . ఈ క్షేత్రం లో మాత్రమే శివపార్వతులు ఒకే పానపట్ట పై దర్శనమిచ్చే క్షేత్రం శ్రీ బాల పార్వతి సమేత శ్రీ జలదీశ్వర స్వామి క్షేత్రం ఘంటసాలలో కలదు . ఇలా ఎన్నో దేవాలయాలు భక్తులను ఆశ్చర్యపరుస్తూ భక్తుల పాలిట కొంగుబంగారంగా నిలుస్తున్నాయి .
ఈ మూడు జిల్లాలలో ఒకవైపు దేవాలయాలు ఉంటే మరోపక్క విహార ప్రదేశాలు రారమ్మని ప్రకృతి ప్రేముకులను పిలుస్తుంటాయి . ఒక వైపు సముద్రం మరో వైపు కృష్ణ గోదావరమ్మా ఉండగా కడియం నర్శరీలు , పాపికొండలు మారేడుమిల్లి అందాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి .
సముద్ర తీర మరియు నదీపరివాహక దేవాలయాలు
అంతర్వేది , అప్పనపల్లి , అయినవిల్లి , మురమళ్ళ , వాడపల్లి, హంసలదీవి దేవాలయాలు
గిరిక్షేత్రాలు :
అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయం , తలుపులమ్మ లోవ , ద్వారకాతిరుమల , కోరుకోండ శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయం , తంటికొండ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం , విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి , వేదాద్రి శ్రీ యోగానంద లక్ష్మి నరసింహ వారి దేవస్థానం , తిరుమలగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం.
Comments
Post a Comment